
పెరుగు పేగుఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అయితే ఇలా పెరుగులో చక్కెర వేసుకొని తినడం వలన ఇది శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తుందంట.

అల్పాహారం సమయంలో ప్రతి రోజూ పెరుగు, చక్కెర కలిపి వ్యాయామం తర్వాత తీసుకోవడం వలన ఇది శరీరానికి అవసరమైన కేలరీలను అందిస్తుంది. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

పెరుగులో కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి చాలా మంచిది. అంతే కాకుండా, రోజూ పెరుగు తినడం వలన ఇది ఎముకలను ధృఢంగా తయారు చేసి, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అదే విధంగా పెరుగు, చక్కెర కలిపి తీసుకోవడం వలన ప్రోబయోటిక్స్, విటమిన్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని రోజూ తినడం వలన ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.అయితే పెరుగలో అధికంగా కాకుండా కొంత మొత్తంలో చక్కెర తీసుకోవడం వలన ఇది మానసిక స్థితిని మెరుగు పరుస్తుందంట, అలాగే, బరువు నియంత్రణకు సహాయపడటమే కాకుండా, కడుపు నిండుగా ఉండేలా చేస్తుందంట.