
ఇక కొందరు ఉదయం టీ తాగితే మరికొందరు సాయంత్ర, ఆఫీసుల్లో వర్క్ చేసేవారు మాత్రం రోజుకు రెండు లేదా మూడు సార్లు తప్పక టీ తాగుతుంటారు. అయితే టీ తాగే క్రమంలో కొన్ని రకాల ఆహారపదార్థాలు అస్సలే తీసుకోకూడని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ తాగిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్ పడ్లు తీసుకోకూడదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది.ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే టీ తో పాటు, లేదా టీ తాగిన వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడంట.

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే టీతో పాటు దీనిని అస్సలే కలిపి తీసుకోకూడదట. దీని వలన ఇది శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం, రక్తహీనతకు దారి తీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే కొంత మంది టీతో పాటు స్వీట్ తింటుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. టీలో కెఫిన్ ఎక్కవ మొతాదులో ఉంటుంది. అందువలన టీతోపాటు స్వీట్స్ తీసుకోవడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి మధుమేహ సమస్యలకు కారణం అవుతుందంట.

అదే విధంగా టీతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పాల ఉత్ప్తులు, ముఖ్యంగా పెరుగు, జున్ను వంటివి తీసుకోకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అనేక అనారోగ్య సమస్యలు కారణం అవుతుందంట.