డయాబెటీస్ వచ్చే ముందు శరీరం ఇచ్చే ప్రారంభ సంకేతాలివే!

Updated on: Jul 17, 2025 | 11:25 AM

ఈ రోజుల్లో చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇక రక్తంలో ( గ్లూకోజ్) చక్కర స్థాయి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువలన డయాబెటీస్ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని వలన ఎలాంటి సమస్య ఉండదంట. ఇక డయాబెటీస్ వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం

1 / 5
 గతంలోకంటే, ప్రస్తుతం ఎక్కువగా ఆకలి, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించే కోరిక డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా తీసుకోలేకపోతంది. దీని వలన కణాలకు తగిన శక్తి లభించక నిరంతరం ఆకలి అవుతుందంట. డయాబెటీస్ వచ్చే ముందు కనిపించే ప్రాథమిక సంకేతం ఇది.

2 / 5
డయాబెటిస్ వచ్చే ప్రారంభంలో విపరీతమైన అలసట, నీరసం ఉంటుందంట. ఎందుకంటే శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా తీసుకోకపోవడం వలన శరీరంలో శక్తి నశిస్తుంది. దీని వలన చాలా వరకు అలసట, నీరసం, ఏ పని చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయంట. అయితే మీకు ఉన్నట్లుండి, ఒక్కసారిగా తీవ్ర అలసటకు గురి అవుతే ఇది డయాబెటిస్ ప్రారంభ లక్షణమేనంట.

3 / 5
డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.  అందువలన వీరు చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా, జ్వరం, తరచుగా జలుబు, శ్వాసకోశ సమస్యలు లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వంటి  వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు పదే పదే ఎదురవుతుంటే కూడా ఇది డయాబెటిస్ ప్రారంభ లక్షణమేనంట.

4 / 5
గాయం అయిన త్వరగా మానకపోవం, చిన్న గాయం అయినా సరే అది మానడానికి చాలా సమయం పట్టడం కూడా డయాబెటిస్ ప్రారంభ హెచ్చరిక నంట. ఎందుకంటే మధుమేహం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన అది శరీరంలోని ఏ ప్రక్రియనైనాస రే త్వరగా పూర్తి చేయలేదంట. దీనికారణంగా గాయలు త్వరగా మానిపోవంట.

5 / 5
రక్తంలో అధిక మొత్తంలో చక్కర స్థాయిలు ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో మార్పులు చోటు చేసుకుంటాయి. డయాబెటీస్ ఉన్న వారిలో మూత్ర విసర్జన అనేది పెరుగుతుందంట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే వారు అలర్ట్ అవ్వాల్సిందే, ఇది డయాబెటిస్ ప్రారంభ సంకేతం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.