దేశంలో అతిపెద్ద చోరీలు ఇవే.. ఏకంగా తాజ్‌మహల్‌‎నే అమ్మేసిన దొంగలు..

Updated on: Sep 16, 2025 | 2:23 PM

దేశంలోని అనేక ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. పలు బ్యాంకుల్లో దోపిడీ దొంగలు చొరబడి కోట్లాది రూపాయలు ఎత్తుకుపోతున్న సందర్భాలూ చూస్తున్నాం. అయితే, కొన్ని భారీ చోరీ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. కొందరు కేటుగాళ్లు ప్రజలను మోసగించి ఏకంగా పార్లమెంట్, ఎర్రకోట, తాజ్‌మహల్ వంటి కట్టడాలనే విక్రయించారు. దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న ఇలాంటి ఘటనలు, సంచలన దోపిడీలు, మోసాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఘజియాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఘజియాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. పీఎన్‌బీ మోడీ నగర్ బ్రాంచ్‌లోని తొమ్మిది అంగుళాల గోడ వెంబడి, రెండు అడుగుల వెడల్పు సొరంగం తవ్వి.. లాకర్లలోని కోట్లాది రూపాయల విలువైన వస్తువులను అపహరించారు.

2 / 5
సేలం - చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ: 2016లో సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ఆర్బీఐ రూ. 350 కోట్లకు పైగా డబ్బును రవాణా చేస్తోంది. అది తెలుసుకున్న దొంగలు.. డబ్బులు ఉన్న ప్రత్యేక కోచ్ పైకప్పును ధ్వంసం చేసి.. సుమారు రూ.5.75 కోట్లను ఎత్తుకెళ్లారు.

3 / 5
లూథియానా బ్యాంక్ చోరీ: ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (CASB) చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్, అకా ల్యాబ్ సింగ్, సహాయకులు పోలీసుల వేషంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మిల్లర్ గంజ్ శాఖలోకి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లలో 6 కోట్లను దోచుకున్నారు.

4 / 5
తాజ్‌మహల్‌ను మూడుసార్లు 'విక్రయించారు': మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ అలియాస్ నట్వర్ లాల్.. దేశంలో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద దోపిడీ, చీటింగ్ కేసుల్లో ఇది కూడా ఒకటి. ఇతను ఏకంగా తాజ్ మహల్, భారత పార్లమెంటు భవనం, ఎర్రకోట భవనం, రాష్ట్రపతి భవన్‌లను కూడా విక్రయించాడు.

5 / 5
ఒపెరా హౌస్ దోపిడీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులుగా నటిస్తూ ఓ బృందం మారువేషంలో బొంబాయిలోని త్రిభువనదాస్ భీమ్ జవేరి అండ్ సన్స్ జ్యువెలర్స్‌కు చెందిన ఒపెరా హౌస్ శాఖపై దాడి చేసింది. ఆ రోజు షాపులో రూ. 36 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.