
ప్రశాంతమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటే లాన్సౌ డౌన్ బెస్ట్ ప్లేస్. ఇక్కడి తక్కువ రద్దీ ఉండే హిల్ స్టేషన్స్, టిప్ ఇన్ టాప్ వ్యూ పాయింట్, భుల్లా తాల్ వంటివి చూడటానికి చాలా బాగుంటాయి.

అందమైన పర్వతాల మధ్య, సహజ పండ్లతోటల మధ్య మీ పిల్లలు లేదా ఫ్యామిలీతో సరదాగా గడపాలి అనుకుంటే ముక్తేశ్వర్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం, పర్వతారోహన, చావ్లీ కి జాలి, కొంటల్లో ట్రెక్కింగ్ మంచి అనుభూతిని ఇస్తాయి.

మీరు మీ స్నేహితులు లేదా బంధువులతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనాటల్ బెస్ట్. ఇక్కడి అందమైన లోయలు, పూలతోటలు, సెలయేళ్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.అలాగే హిల్ స్టేషన్స్, దట్టమైన అడువులు, అందమైన ఆకాశాన్ని చూస్తు ఎంజాయ్ చేయవచ్చు.

భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన చోప్టా బెస్ట్ పర్యాటక ప్రదేశం. ఇక్కడి ఎత్తైన కొండలు, తుంగనాథ్ ఆలయం, ట్రెక్కింగ్, అందమైన ప్రకృతి సౌదర్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

సాహస యాత్రికులకు స్వర్గధామం మున్సియారి . ఇక్కడికి వెళ్లాలి అనుకునే వారు చాలా ఎంజాయ్ చేస్తారంట. ఉత్కంఠ భరితమైన ట్రెక్కింగ్ ఆనందాన్నిఇస్తుంది.