
కేరళ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పచ్చటి చెట్లు, చుట్టూ పెద్ద పెద్ద కొండలు,జలపాతాలు చూస్తూ ఆనందంగా గడపాలి అనుకుంటే కేరళలోని కొన్ని స్పెషల్ ప్లేసెస్ సందర్శించాల్సిందేనంట. ఇక్కడికి వెళ్తే ఆనందంగా ఎంజాయ్ చేయడమే కాకుండా, మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందంట.

కేరళ లోని అద్భుతమైన ప్రదేశాల్లో వాయినాడ్ ఒకటి. ట్రెక్కింగ్, బోటింగ్, గుహలను చూడాలి అనుకునే వారు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చును. అంతే కాకుండా ఇక్కవన్య ప్రాణులను కూడా చూడవచ్చునంట. అందువలన చాలా సరదాగా గడపాలి, అంతే కాకుండా బోటింగ వంటి సాహసాలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

త్రినూర్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక్కడ కోటలు, జలపాతాలతో ఇది ప్రసిద్ధి చెందినది. కేరళ సాంసృతిక రాజధాని త్రినూర్. ఇది మంచి పర్యాటక కేంద్రం. పురావస్తు మ్యూజియం, జలపాతాలు, ఏనుగుల అభయారణ్యం, వంటివి చూడటానికి కేరళలోని త్రినూర్ బెస్ట్ ప్లేస్.

బీచ్‌లకు నిలయం కోజికోడ్. ఇక్కడ అద్భుతమైన స్వీట్స్ ఉంటాయి. దీనిని స్వీట్స్‌కు నియలం అని కూడా అంటారు. మీరు కోచికోడ్ కు వెళ్తే కల్లుమ్మకాయ, చట్టిపత్తిరి, వివిధ రకాల జలేబీలు, హల్వా రుచి చూడవచ్చు. పాత లైట్‌హౌస్, బీచ్, మనంచిరా చౌక్, సరోవరం బయో పార్క్ వంటి ప్రదేశాలు చాలా ఆనందాన్నిస్తాయి.

కేరళలోని అద్భతమైన ప్రదేశాల్లో కొచ్చి కూడా ఒకటి. ఒ చైనీస్ నెట్ ఫిషింగ్, కేఫ్‌లు, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, దేవాలయాలు, మ్యూజియంలు, ప్యాలెస్‌లు, భారతీయ, విదేశీ సంస్కృతుల ప్రభావాలు అన్నీ కొచ్చిలో ఉన్నాయి. స్నేహితులతో ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.