
అయితే ఇలాంటి పని ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

అల్లం టీ : అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు అధిక ఒత్తిడితో గనుక బాధపడుతున్నట్లు అయితే, దాని నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ఇంటిలో చక్కటి అల్లం టీ చేసుకొని తాగడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసు శాంతపడుతుందంట.

పెరుగు : పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ పెరుగు తినడం వలన ఇది ఎముకలను బలంగా తయారు చేస్తుంది. అయితే దీనిని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తింటే, ఇది కండరాలను సడలించి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచి, ఆందోళనను తగ్గిస్తుందంట.

చాక్లెట్స్ : తక్కువ మొత్తంలో చాక్లెట్స్ తినడం కూడా ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడవేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చాక్లెట్ కొనుగోలు చేసి తినాలంట. ఇది మనసుకు హాయినిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్ర 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వలన కూడా మనసు రిఫ్రెష్ అవుతుందంట. ఇది ఒత్తిడిని తగ్గించి, మీ మనసును శాంతపరుస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.