
ప్రస్తుత కాలంలో ఎంతో మంది జ్వరాలతో బాధ పడుతున్నారు. జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జ్వరాల కారణంగా శరీరంలో ప్లేట్ లేట్స్ సంఖ్య అనేది బాగా తగ్గిపోతుంది. ప్లేట్ లేట్స్ తగ్గిపోతే.. ప్రాణానికే ప్రమాదం. ప్లేట్‌లేట్స్ శరీరంలో అనేక ముఖ్యమైన పనులను నిర్వర్తిస్తుంది.

డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సాధారణంగా శరీరంలో ప్లేట్‌లేట్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ సమయంలో ప్లేట్‌లేట్స్ పెంచే ఆహారాలను తీసుకోవాలి. ప్లేట్‌లేట్స్‌ని పెంచే బెస్ట్ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరంలో అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్‌ని అభివృద్ధి చేస్తుంది. నేచురల్‌గా ప్లేట్‌లేట్స్ కౌంట్ పెంచడంలో సహాయ పడుతుంది. అదే విధంగా ప్లేట్‌లేట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి పండు, బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం కూడా మంచిదే.

ఆప్రికాట్‌లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ప్లేట్‌లేట్స్ కౌంట్ తగ్గినప్పుడు ఆప్రికాట్స్ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా పని చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల కూడా చక్కగా ప్లేట్‌లేట్స్ సంఖ్య అభివృద్ధి అవుతాయి.

బీట్ రూట్, ఆకు కూరలు, ఎండు ద్రాక్ష, దానిమ్మ, వెల్లుల్లి వంటి ఆహారాలు రోజుకు రెండు సార్లు తీసుకున్నా శరీరంలో ప్లేట్‌లేట్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)