
నారింజ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ నారింజ పండ్లతోనే కాదు, తొక్కల వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నారింజ తొక్కలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన వీటిని ఎండ బెట్టి పొడి చేసుకొని తీసుకోవం వలన ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, మిమ్మల్ని బలంగా తయారు చేస్తుందంట.

నారింజ తొక్కల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, కొవ్వును కరిగిస్తుంది. అంతే కాకుండా నారిజ తొక్కల టీ ఆకలిని నియంత్రిస్తుంది. అందువలన ఇది తాగడం వలన త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది.

నారింజ తొక్కల పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైర్ జీర్ణక్రియను మెరుగు పరిచి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, వంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాగే పేగులను శుభ్రపరుస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ తొక్కతో టీ చేసుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

నారింజ తొక్కలో గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం నారింజ తొక్కల టీ తాగడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.