
నిమ్మకాయ నీరు: గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకొని త్రాగడం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన మార్గం. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి, పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల కాలేయ నిర్విషీకరణతో పాటు మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కాలేయ కణాలను రక్షిస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే, కాలేయ ఎంజైమ్‌లు బాగా పనిచేస్తాయి అలాగే ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకుంటుంది.

Beetroot Juice

పసుపు టీ: పసుపుతో తయారుచేసిన టీ కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం కాలేయం వాపును తగ్గిస్తుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. పసుపు కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, చెడు కణాలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే హానికరమైన పదార్థాల నుండి కాలేయాన్ని రక్షిస్తుంది.

అల్లం-పుదీనా నీరు: అల్లం, పుదీనాను మరిగించి తయారు చేసిన ఈ పానీయం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే అల్లం కాలేయ వాపును తగ్గిస్తుంది. పుదీనా జీర్ణక్రియ, పిత్త ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.