
అన్నం: ఇంట్లో రోజూ అన్నం ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. అన్నం, బిర్యానీ మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడే తినాలని వైద్యులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటెడ్ రైస్ 24 గంటల తర్వాత విషపూరితంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వెల్లుల్లి: చాలా మంది వెల్లుల్లిని తొక్క తీసి ఉంచుకుంటారు. పీలింగ్ సమయం పడుతుంది కాబట్టి. కానీ, ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఆహారంలో ఉపయోగించకూడదు. ముఖ్యంగా పొట్టు తీసిన వెల్లుల్లిని ఫ్రిజ్ లో ఉంచి ఆహారంలో వాడితే విషపూరితం అవుతుంది.

టమాటో: టమాటోలు, బంగాళదుంపలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆకుకూరలను తాజాగా ఉడికించడం మంచిది. ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషకాలు తగ్గడమే కాకుండా కొన్నిసార్లు విషాలుగా మారుతాయి. దీని వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు.

ఉల్లిపాయలు: ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల స్టార్చ్ కంటెంట్ ఘనపదార్థాలుగా మారుతుంది. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఉల్లిపాళయాన్ని ఫ్రిజ్‌లో ఉంచవద్దు. వాటిని ఆహారంలో ఉపయోగించవద్దు. అందులో బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా వస్తుంది.

అల్లం: ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాన్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే అల్లంను ఫ్రిజ్‌లో ఉంచితే కిడ్నీ, లివర్ పాడయ్యే అవకాశం ఉంది. అల్లంలో ఉండే పోషకాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు నశిస్తాయి.