రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు కణాలకు పోషకాలు, ఆక్సిజన్ పుష్కలంగా అందుతాయి. పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వల్ల మెదడు ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అధిక సమయం కూర్చుని పనిచేసేవారు ఉదయం వేళ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లేదంటే మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. క్రమంగా అనేక వ్యాధులు వస్తాయి. మెదడు సామర్ధ్యం కూడా వేగంగా క్షీణిస్తుంది.