AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా.. రూపాయి కూడా తీసుకోలేదు.. సోనాలి బింద్రే ..

గర్భవతిగా ఉన్న సమయంలోనే ఓ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు నటి సోనాలి బింద్రే వెల్లడించారు. సినిమా రంగానికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే ఆ పాట కోసం తాను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగానే పనిచేశానని ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Oct 12, 2026 | 9:06 PM

Share
బాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో అగ్ర హీరోల సరసన నటించి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అయితే, ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఒక సూపర్‌హిట్ పాట గురించిన ఆసక్తికర విషయాన్ని సోనాలి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

1 / 5
మహారాష్ట్రకు చెందిన మరాఠీ ముద్దుగుమ్మ అయిన సోనాలి బింద్రే, హిందీ చిత్రాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నప్పటికీ మరాఠీ చిత్ర పరిశ్రమపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేదార్ షాండే దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన విజయం సాధించిన మరాఠీ చిత్రం 'అగ బై అరెచ్చా!'. ఈ చిత్రంలో సోనాలి బింద్రే ప్రత్యేక గీతంగా నటించిన ‘చమ్ చమ్ కర్తా హై నశీలా బదన్’ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటలో ఆమె చేసిన అద్భుతమైన డ్యాన్స్, హావభావాలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి.

2 / 5
ఈ ఒక్క పాటతో ఆమెకు మరాఠీ ప్రేక్షకులలో దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇతని కెరీర్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ పాట వెనుక ఒక ఆసక్తికరమైన నిజం దాగి ఉంది. ఈ పాటకు తాను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని సోనాలి బింద్రే స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "ఆ సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పట్లో దర్శకుడు , చిత్ర యూనిట్ పూర్తిగా కొత్తవారమని చెప్పారు.

3 / 5
ఒక కొత్త సినిమాకు, కొత్త దర్శకులకు నా సహాయం మంచి బూస్ట్ లభిస్తుందని నన్ను కోరారు" అని గుర్తుచేసుకున్నారు. "కొత్త వారికి , మరాఠీ సినిమా రంగానికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే నేను ఆ పాట చేయడానికి అంగీకరించాను. ఆ చిత్ర యూనిట్‌కు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ పాటలో నటించాను తప్ప, దాని కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. వాళ్లు అడిగిన వెంటనే నా వంతుగా నేను ఏది ఉత్తమంగా చేయగలనో అది చేశాను" అంటూ సోనాలి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

4 / 5
ఈ సందర్భంగా సోనాలి మాట్లాడుతూ  'ఛమ్ ఛమ్' పాట షూటింగ్ సమయంలో తాను గర్భవతిగా ఉన్నానని, అదే స్థితిలో షూటింగ్ పూర్తి చేశానని సోనాలి చెప్పింది.  తన గర్భం గురించి ఆమెకు ఏమాత్రం తెలియదు. ఈ పాటకు ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్స్ రిహార్సల్స్ సమయంలో, ఫరా తరచుగా సోనాలి కొద్దిగా ఉబ్బిన కడుపు గురించి ఆటపట్టిస్తూ, "గోల్డీ బెహల్ స్టఫ్డ్ పరాటాలు ఇప్పుడు రంగు మారడం మొదలుపెట్టాయని నేను అనుకుంటున్నాను" అని అనేది. ఆ సమయంలో, వాళ్లిద్దరూ దాని గురించి నవ్వుకునేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత, పరీక్ష చేయగా ఆమె తల్లి కాబోతోందని వెల్లడైందని తెలిపారు.

5 / 5
Follow Us