
అయితే అతి త్వరలో హస్తా నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయనున్నాడు. సెప్టెంబర్ 27న సూర్యుడు హస్తా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక లాభాలు చేకూరుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : సూర్యుడు హస్తా నక్షత్రంలోకి సంచారం వలన మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయం చేకూరుతుంది. ఇక ఎవరైతే ఒంటరిగా జీవితం గడుపుతున్నారో వారికి తోడు కూడా దొరకనుంది. అంటే ? వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సారి వివాహం జరగనుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఆనందంకర జీవితం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. మీ భాగస్వామి సహాకరంతో డబ్బు పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. ఎవరైతే చాలా రోజుల నుంచి నూతన వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారో, వారి కోరిక తీరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అనుకున్న పనులన్నీసమయానికి నెరవేరుతాయి. చాలా ఆనందకర జీవితాన్ని గడుపుతారు. చాలా రోజుల నుంచి ఎవరైతే విహారాయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్య గ్రహం హస్త నక్షత్ర సంచారం వలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది.