Skin Care Tips: నా అందానికి రహస్యమదే.. రోజూ ఆ పనులు చేయడం తప్పనిసరి అంటున్న దీపికా పదుకొనే..!

|

Aug 03, 2024 | 3:15 PM

సాధారణంగా మహిళలు అందానికి ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ను అనుకరిస్తూ వారి అందాల రహస్యాలను తెలుసుకుని వారిలో అందంగా తయారవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. దీపికా పదుకొనే ఈ పేరు బాలివుడ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఏళ్లుగా బాలివుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్‌గా చలామణి అవుతుంది. ఇటీవల కల్కి సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటున్న దీపికా పదుకొనే అందానికి రహస్యమేంటి? అని ఆమె అభిమానులు ఎప్పుడు సెర్చు చేస్తూ ఉంటారు. ఇటీవల ఆమె చర్మ సౌందర్యానికి తాను తీసుకునే జాగ్రత్తలను వివరించింది. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే చర్మ సౌందర్యానికి తీసుకునే రక్షణ చర్యల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
రోజూ శరీరానికి అవసరమయ్యే డైట్ ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణు చెబుతున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడే అవసరమైన పోషకాలు అందుతాయి. బెర్రీలు, ఆకుకూరలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయని, అలాంటి ఆహారాన్ని డైలీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు.

2 / 5
నాణ్యమైన నిద్ర అనేది ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చర్మం విషయంలో మంచి నాణ్యమైన నిద్ర మీ చర్మాన్ని రోజువారీ ఒత్తిళ్ల నుంచి తిరిగి పొందేలా చేస్తుంది. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోతే శరీరంలో వృద్ధాప్య సంకేతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఏడు గంటల పాటు బాగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
మన చర్మ రక్షణకు నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉండడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం బొద్దుగా, యవ్వనంగా ఉంటుందని సూచిస్తున్నారు. హైడ్రేటెడ్‌గా లేకపోతే చర్మం పొడిబారి మచ్చల బారిన పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

4 / 5
వారానికి ఓ సారి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మీ చర్మానికి లోతైన చికిత్స అందించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  ఫేస్ మాస్క్‌లు చర్మాన్ని ఫ్రెష్‌గా మార్చడానికి, రంధ్రాలను బిగుతుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఫేస్ మాస్క్‌ల వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

5 / 5
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ముఖ్యంగా చర్మం తేమను మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం పెరిగి చర్మ కణాల పునరుత్పత్తికి, ఆరోగ్యకరమైన, మెరిసే ఛాయకు తోడ్పడుతుంది. వ్యాయామం చేసే సమయంలో చెమట పట్టడం వల్ల చర్మంలోని మలినాలను తొలగుతాయని నిపుణులు వివరిస్తున్నారు.