ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్.. ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు యూట్యూబ్‌లో గేమ్స్ ఆడుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ సదుపాయం కేవలం యూట్యూబ్ ప్రీమియం సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆడుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
ఆండ్రాయిడ్, iOS, వెబ్‌లో యూట్యూబ్ యాప్‌లో ప్లే చేయగల 30కి పైగా ఆర్కేడ్ గేమ్‌ల కొత్త సేకరణను ప్లాట్‌ఫారమ్ 'ప్లేబుల్స్'ను విడుదల చేసింది. ప్లేబుల్స్‌ని ఎనేబుల్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం ముందుగా యూట్యూబ్‌లోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌పేజీలో క్రిందికి స్క్రోల్ చేయడం ద్వారా ప్లేయబుల్స్ షెల్ఫ్‌ను క్లిక్ చేయాలి.
అనంతరం దిగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ బటన్‌ను క్లిక్ చేసి.. మీ ప్రీమియం ప్రయోజనాలు కిందికి స్క్రోల్ చేసి ప్లేబుల్స్ గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం 37 గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాంగ్రీ బర్డ్స్ షోడౌన్, కానన్ బాల్స్ 3D వంటి యాక్షన్ గేమ్‌లు, డైలీ క్రాస్‌వర్డ్‌తో పాటు మరికొన్ని గేమ్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే గేమ్స్‌తో పాటు.. ప్రీమియం సబ్‌స్క్రైబర్‌ల కోసం కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 1080p వీడియోలపై దాని మెరుగైన బిట్‌రేట్ ఆఫర్‌ను ప్రీమియం వినియోగదారులకు అందిస్తోంది.
అయితే తొలుత ఈ ఫీచర్‌ను ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే తీసుకొచ్చారు. అనంతరం ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవల్లోనూ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రీమియం ధర 12 నెలల ప్లాన్‌కు రూ.1,290, మూడు నెలల ప్లాన్ రూ. 399. ఒక నెల ప్రీ-పెయిడ్ ప్లాన్ రూ.139కి అందుబాటులో ఉంది.