
జియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్.. ఈ స్మార్ట్ ఫోన్ ని జియోమీ రూ. 89,999కి లాంచ్ చేసింది. ఇప్పుడు తొమ్మిదో యానివర్సరీ సేల్లో భాగంగా దీనిపై రూ. 20,000 తగ్గింపును అందిస్తోంది. అంటే దీనిని మీరు రూ. 69,999కే సొంతం చేసుకోవచ్చు.

జియోమీ 12 ప్రో.. ఈస్మార్ట్ ఫోన్ ని జియోమీ మన దేశంలో 2022లో లాంచ్ చేసింది. రూ. 79,999ప్రారం ధరగా విక్రయాలు ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఫోన్ పై కూడా తొమ్మిదో యానివర్సరీ సేల్ లో భాగంగా ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 39,999 తగ్గింపు అందిస్తోంది. అంటే ఈ ఫోన్ మీరు ఇప్పుడు కేవలం రూ. 40,000లకే పొందవచ్చు.

రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ.. ఈ ఫోన్ ని ఈ ఏడాది మొదట్లోనే జియోమీ లాంచ్ చేసింది. దీని వాస్తవ ధర రూ. 27,999గా ఉంది. ఇప్పుడు దీనిపై కూడా యానివర్సరీ సేల్ లో భాగంగా రూ. 7,500 తగ్గింపును అందిస్తోంది. అంటే ఈ ఫోన్ మీరు కేవలం రూ. 20,499కే సొంతం చేసుకోవచ్చు.

జియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో 43.. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 49,999కి జియోమీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ టీవీపై ఏకంగా రూ. 18,500లను తగ్గిస్తోంది. యానివర్సరీ సేల్ లో భాగంగా ఈ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం రూ. 31,499కే లభిస్తోంది.

రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32.. ఫైర్ టీవీ ద్వారా శక్తి పొందిన రెడ్ మీ స్మార్ట్ టీవీపై అదిరే ఆఫర్ ఉంది. దీని వాస్తవ ధర రూ. 24,999కాగా.. తొమ్మిదో యానివర్సరీ సేల్ ోభాగంగా దీనిపై ఏకంగా రూ.15,250 తగ్గింపు అందిస్తోంది. అంటే ఈ 32 అంగుళాల టీవీని మీరు కేవలం రూ. 9,749కే సొంతం చేసుకోవచ్చు.

జియోమీ పాడ్ 6.. ఈ ట్యాబ్లెట్ ను జియోమీ 39,999కి లాంచ్ చేసింది. దీనపై కూడా అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. తొమ్మిదో యానివర్సరీ సేల్ లో భాగంగా రూ. 15,000 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మీకు ఇది రూ. 24,999కే లభిస్తోంది.

రెడ్ మీ పాడ్.. ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 33,999 కాగా, దీనిపై జియోమీ యానివర్సరీ సేల్ లో భాగంగా రూ. 16,000 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఇది కేవలం రూ. 17,999కే లభ్యమవుతోంది.