
ఆక్వా గార్డ్ డిలైట్ ఎన్ఎక్స్ టీ ఆక్వా సేవర్ వాటర్ ఫ్యూరిఫైయర్ దాదాపు 55 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దాదాపు 60 శాతం వరకూ నీటిని పొదుపు చేస్తుంది. మినరల్ చార్జ్, స్మార్ట్ ఎల్ఈడీ హెచ్చరికలు, ఆర్వో+యూవీ+యూఎఫ్+ఎంసీ టెక్నాలజీ, 9 స్టేజ్ ప్యూరిఫికేషన్ దీని ప్రత్యేకతలు. బోరు, ట్యాంకర్ తదితర అన్ని రకాల నీటిని స్వచ్ఛమైన రుచితో అందిస్తుంది. అమెజాన్ లో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ను రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు.

కెంట్ సుప్రీం ఆల్కలీన్ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ లోని యూవీ ఎల్ఈడీ ట్యాంకు ద్వారా బ్యాక్టీరియా లేని స్వచ్ఛమైన నీటిని పొందవచ్చు. బోరు, ట్యాంకర్, మున్సిపల్ తదితర అన్ని రకాల నీటిని శుద్ది చేస్తుంది. 8 లీటర్ల నిల్వ సామర్థ్యం, గంటలకు 20 లీటర్ల నీటి ప్రవాహ రేటు, 9.5 వరకూ ఆల్కలీన్ పీహెచ్ స్థాయి, టీడీఎస్ కంట్రోలర్ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో దాదాపు 42 శాతం తగ్గింపుపై రూ.14,099కు ఈ వాటర్ ప్యూరిఫైయర్ అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది సభ్యులున్న ఇంటికి ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ చక్కగా సరిపోతుంది. దీని ట్యాంకు నిల్వ సామర్థ్యం పది లీటర్లు. బోర్ వెల్, ట్యాంకర్, మున్సిపల్ తదితర అన్ని రకాల నీటిని శుద్ది చేస్తుంది. ఏడు దశల శుద్ధీకరణ, ఆర్వో+యూవీ+ఎంఎఫ్ టెక్నాలజీ, స్మార్ట్ సెన్స్ ఫిల్టర్ అలర్టులు, 60 శాతం నీటి పొదుపు, హై స్పీడ్ ప్యూరిఫికేషన్ దీని ప్రత్యేకతలు. అెమెజాన్ లో రూ.10,999కి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అందుబాటులో ఉంది.

ప్యూరిట్ మెరీనా ప్రో మినరల్ ఆర్వో ఏడు లీటర్ల స్టోరేజీ ట్యాంకు సామర్థ్యంతో అందుబాటులో ఉంది. ఏడు దశల ప్యూరిఫికేషన్, యూవీ ఎల్ఈడీ ఇన్ ట్యాంక్ స్టెరిలైజేషన్, మినరల్ ఎన్ రిచ్ మెంట్, 45 శాతం నీటి పొదుపు, వంద శాతం శుద్ధమైన నీరు అందించడం దీని ప్రత్యేకతలు. బోర్ వెల్, ట్యాంకర్, మున్సిపల్ తదితర అన్ని రకాల నీటికి సరిపోతుంది. 6 వేల లీటర్ల ఫిల్టర్ లైఫ్, స్మార్ట్ సెన్స్ అలర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.7499కు అమెజాన్ లో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ను కొనుగోలు చేయవచ్చు.

మున్సిపల్ నీరు అంటే 200 పీపీఎం కంటే తక్కువ టీడీఎస్ ఉన్న నీటికి ఆక్వా గార్డ్ స్లిమ్ గ్లాస్ యూవీ బార్ ఇన్ లైన్ వాటర్ ప్యూరిఫైయర్ చక్కగా సరిపోతుంది. దీనిలో ఏడు దశల శుద్ధీకరణ, అంతర్నిర్మిత టీడీఎస్ మీటర్, రియల్ టైమ్ నీటి నాణ్యత సూచికలు, పైభాగంలో ప్రిమియం గ్లాస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 5వ తరం యూవీ ఎల్ఈడీతో సురక్షితమైన నీటిని పొందవచ్చు. యాక్టివ్ కాపర్, మినరల్ గార్డ్ టెక్నాలజీతో నాణ్యత ఎంతో బాగుంటుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అమెజాన్ లో రూ.12,700కు అందుబాటులో ఉంది.