
కొత్త ఏడాది వచ్చిందంటే చాలు చాలా మంది కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఆరోగ్యానికి హానికరమని తెలిసినా వీడని అలవాట్లలో స్మోకింగ్ ఒకటి. మరి ఈ ఏడాది స్మోకింగ్ మానాలని డిసైడ్ అయిన వారికోసం కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయనే విషయం మీకు తెలుసా.?

Easy Quit: ఐఓస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ స్మోకింగ్‌ను మానిపించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కొన్ని ఫీచర్ల ద్వారా స్మోకింగ్ అలవాటుకు క్రమంగా దూరం కావొచ్చు. ఇక ఈ యాప్‌లో ఉన్న కొన్ని టూల్స్ స్మోకింగ్ అలవాటును ట్రాకింగ్ కూడా చేయగలుగుతుంది.

Smoke Free: పొగతాగే అలవాటును దూరం చేయడానికి ఉపయోగపడే యాప్‌లలో స్మోక్ ఫ్రీ యాప్ ఒకటి. స్మోకింగ్‌ను దూరం చేసుకోవడానికి నిపుణులతో కూడిన సలహాలు, సూచనలను ఇందులో అందుబాటులో ఉంచుతారు.

Kwit: పొగాకు దూరంగా ఉండాలనుకుంటోన్న వారికి ఈ యాప్ స్ఫూర్తివంతమైన కొటేషన్స్‌తో మోటివేట్ చేస్తోంది. ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో స్మోకింగ్ మానేయడానికి సంబంధించి ప్రొగ్రెస్‌ను ఎప్పటికప్పుడు వివరంగా అందిస్తుంది.

Quit Now: ఈ యాప్ మీలో సిగరేట్ తాగాలనే కోరికను తగ్గిస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు, మానేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ సమాచారాన్ని అందిస్తారు. అలాగే పొగతాగడం మానేయడం వల్ల ఎంత డబ్బును ఆదా చేయవచ్చు లాంటి వివరాలను గ్రాఫిక్స్ రూపంలో యూజర్లను అలర్ట్ చేస్తుంటారు.