- Telugu News Photo Gallery Technology photos Truecaller brings new features group call spam sms inbox clear features
TrueCaller Features: సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకర్షిస్తోన్న ట్రూకాలర్.. ఆ కొత్త ఫీచర్లపై ఓ లుక్కేయండి..
TrueCaller Features: తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంది ట్రూ కాలర్ యాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ట్రూకాలర్..తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడుకునే వీలున్న ఆప్షన్స్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను తీసుక్చొంది..
Updated on: Jun 20, 2021 | 5:59 AM

అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ట్రూ కాలర్ యాప్. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు తీసుకొస్తుంది కాబట్టే దీనికి ఇంతలా క్రేజ్ వచ్చింది.

ఈ క్రమంలోనే యూజర్లకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకుగాను.. ట్రూకాలర్ తాజాగా కొన్నికొత్త ఫీచర్లను జోడించింది. అవేంటంటే..

వాయిస్ కాల్స్: ఈ ఫీచర్‌తో ఒకేసారి ఎమినిది మంది మాట్లాడుకోవచ్చు. ఈ సమయంలో కాల్‌లో ఉన్న వారు మరొక కాల్‌లో ఉన్నా, ఆఫ్‌లైన్‌లో ఉన్నావెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది.

స్పామ్ ఎస్‌ఎంస్: ఈ ఫీచర్ స్పామ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేస్తుంది. ఓటీపీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, చెల్లింపు రిమైండర్‌లు మెసేజ్‌లను హైలైట్ చేస్తుంది.

ఇన్ బాక్స్ క్లియర్: ఈ ఫీచర్.. ఓటీపీలు,స్పామ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజ్ లను హైలెట్ చేస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌తో వాటిని తొలగించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.




