- Telugu News Photo Gallery Technology photos Troubled by smoke while cooking? clear The problem with those chimneys, Amazon Great Indian Festival chimney offers in telugu
Amazon Great Indian Festival: వంట సమయంలో పొగ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? ఆ చిమ్నీలతో సమస్య ఫసక్
వంట చేస్తున్నప్పుడు కమ్మేసే పొగతో మహిళలు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖ్యంగా వంటలో తాళింపు వంటివి వేసినప్పుడు వచ్చే పొగ వల్ల దగ్గని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పొగ సమస్యకు చిమ్నీలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే ఈ చిమ్నీలపై ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ బ్యాంకు కార్డుల చెల్లింపులపై కూడా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న చిమ్నీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Oct 13, 2024 | 7:45 PM

ఎలికా బీఎల్‌డీసీ ఫిల్టర్‌లెస్ ఆటోక్లీన్ కిచెన్ చిమ్నీపై 50 శాతం తగ్గింపు తో వస్తుంది. దీర్ఘకాలిక పనితీరుతో మోషన్ సెన్సార్‌తో వచ్చే ఈ చిమ్నీ ఆయిల్ స్టెయిన్స్, ఆవిరి వంటి వాటిని ప్రభావవంతంగా తీసుకుంటుంది. ఆటో క్లీన్ ఫంక్షన్,9 స్పీడ్ టచ్ కంట్రోల్, కర్వ్డ్ గ్లాస్ వంటి వాటితో వచ్చే ఈ ఎలికా చిమ్నీ ధర రూ. 15,990గా ఉంది.

ఫాబెర్ ఆటోక్లీన్ కిచెన్ చిమ్నీ 50 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఐ క్లీన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిమ్నీ కిచెన్ హెచ్చరికల కోసం ఆటో-క్లీన్ ఫంక్షన్‌ని ఆన్ చేయడానికి, అలాగే చిమ్నీని శుభ్రపరచడానికి అనువుగా ఉంటుంది. ఈ చిమ్నీ జిడ్డుగల ఆవిరిని ఆపడానికి యూజర్ ఫ్రెండ్లీ టచ్ కంట్రోల్‌తో, ఎల్ఈడీ ల్యాంప్‌తో వస్తుంది. ఈ చిమ్నీ ధర రూ. 14,390గా ఉంది.

గ్లెన్ స్లాంట్ విత్ హీట్ సెన్సార్, ఫిల్టర్‌లెస్ ఆటోక్లీన్ కిచెన్ చిమ్నీపై 53 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ గ్లెన్ చిమ్నీ ద్వారా మీ వంటగదిని శుభ్రపరచడానికి, మీ ఇంటిని పొగ-రహితంగా చేసుకోవచ్చు. డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే ఈ చిమ్నీ ఆటో సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. ఈ చిమ్నీ మోషన్ సెన్సార్‌లతో టచ్ కంట్రోల్‌ను కూడా కలిగి ఉంది. ఫిల్టర్‌లెస్ టెక్నాలజీ, రెండు సంవత్సరాల సమగ్ర వారంటీ, మోటారుపై 7 సంవత్సరాల పాటు వారెంటీను అందిస్తున్నారు. ఈ గ్లెన్ కిచెన్ చిమ్నీ ధర: రూ. 15,999.

వండర్‌చెఫ్ పవర్ ఎలైట్ చిమ్నీ 54 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ వండర్‌చెఫ్ చిమ్నీ భారీ నుంచి మధ్యస్థ వంటతో వంటగదుల్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇటాలియన్ డిజైన్, జర్మన్ క్వాలిటీ స్టాండర్డ్‌తో వచ్చే ఈ చిమ్నా స్టెయిన్‌లెస్ స్టీల్ బాఫిల్ ఫిల్టర్‌తో రూపొందించారు. ఈ వండర్ చెఫ్ కిచెన్ చిమ్నీ ధర కేవలం రూ. 4,649గా ఉంది.

ఇనాల్సా ఎకాన్ పిరమిడ్ కిచెన్ చిమ్నీపై అమెజాన్‌లో ఏకంగా 70 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ చిమ్నీ పిరమిడ్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా చిన్న ప్రాంతాల్లో కూడా తేలిగ్గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇనాల్సా కిచెన్ చిమ్నీ డబుల్ బాఫిల్ ఫిల్టర్‌తో వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ పుష్ కంట్రోల్ బటన్, 60 సెంటీమీటర్ల పరిమాణంతో ఉండే ఈ చిమ్నీ ధర రూ. 4,699గా ఉంది.




