Smart watch: ఏ స్మార్ట్‌ వాచ్‌ కొనాలో అర్థం కావడం లేదా.? బెస్ట్‌ వాచెస్‌పై ఓ లుక్కేయండి..

|

Dec 24, 2023 | 9:36 AM

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల వినియోగం భారీగా పెరిగింది. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్‌ కంపెనీలు స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తుండడం, తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తుండడంతో స్మార్ట్‌వాచ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఇక మార్కెట్లోకి వెల్లువలా స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్న తరుణంలో ఏ వాచ్‌ కొనాలన్న సంశయం రావడం కామన్‌. మరి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ వాచ్‌లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందామా.?

1 / 5
 తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడి వాచ్‌ కోసం సెర్చ్‌ చేసే వారికి అమేజ్‌ ఫిట్‌ టి - రెక్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ వాచ్‌ ధర రూ. 5వేలలోపే లభిస్తోంది. ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. జెప్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ వాచ్‌లో జీపీఎస్‌తో పాటు అన్ని రకాల హెల్త్‌ మానిటరింగ్ ఫీచర్లను అందించారు.

2 / 5
డీజిల్ జెన్ 6: మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ స్మార్ట్‌ వాచ్‌ల్లో డీజిల్ జెన్‌ 6 ఒకటి. ఈ వాచ్‌ ధర రూ. 12,500గా ఉంది. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌తో డిజైన్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ గూగుల్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌లో గోల్స్‌, స్టెప్స్‌, స్లీప్‌, కార్డియో మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు. వాటర్‌ రెసిస్టెంట్‌తో వచ్చే ఈ వాచ్‌లో ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్‌ను అందించారు.

3 / 5
ఫిట్‌బిట్ వెర్సా 2: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 15,999కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,999కి లభిస్తోంది. ఇక ఈ వాచ్‌లో అమెజాన్, అలెక్సా వాయిస్‌ సపోర్ట్ లభిస్తుంది. అలాగే స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్ రేట్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే ఆరు రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది.

4 / 5
ఫాజిల్ జెన్ 6: హై ఎండ్‌ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న మరో స్మార్ట్‌ వాచ్‌ ఫాజిల్‌ జెన్‌ 6. ఈ స్మార్ట్‌ వాచ్‌ ప్రారంభ ధర రూ. 12,000 నుంచి అందుబాటులో ఉంది. గూగుల్‌ వేర్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ వాచ్‌ పనిచేస్తుంది. ఇక ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ప్రత్యేకంగా అందించారు. హెల్త్‌ రేట్, ఆక్సిజన్‌ లెవల్స్‌, స్లీప్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఇచ్చారు.

5 / 5
గార్మిన్ అప్రోచ్ ఎస్12: బ్రాండెండ్‌ మార్కెట్‌కు పెట్టింది పేరైన గార్మిన్‌ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 22,500గా ఉంది. ధరకు తగ్గట్లుగానే ఈ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ సమాచారాన్ని మానిటర్‌ చేస్తుంది. జీపీఎస్‌ వంటి అధునాతన ఫీచర్‌ను ఇందులో అందించారు.