నాయిస్ ట్విస్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ఇది అడ్వాన్స్ డ్ కాలింగ్ అనుభవాన్ని ఇస్తుంది. కాల్ లిస్ట్ ను వాచ్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. 10 కాంటాక్ట్ ల వరకూ సేవ్ చేసుకోవచ్చు. ఇక హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ మానిటర్, 24x7 హార్ట్ రేట్ మానిటర్, స్ట్రెస్ ట్రాకర్, శ్వాస వ్యాయామాలు, మహిళల కోసం సైకిల్ ట్రాకర్ వంటి వివిధ ఆరోగ్య పర్యవేక్షణ సాధనాలతో మీ రోజువారీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో రూ. 1,799గా ఉంది.