- Telugu News Photo Gallery Technology photos These are the best smartphone under 10k Budget check here for full details
Smartphone: 5జీ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో అందుబాటులో ఉన్నవి ఇవే..
ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలోని పలు అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో వస్తున్నాయి. దీంతో మార్కెట్లో 5జీ ఫోన్‌ల సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. మరి రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Apr 29, 2024 | 7:53 PM

Samsung Galaxy M14 5G: రూ. 10వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ. 17,999కాగా అమెజాన్‌లో ఏకంగా 47 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,499కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు.

Redmi 13C 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా డిస్కౌంట్‌లో అమెజాన్‌లో రూ. 10,999కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో వెయ్యి వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు.

POCO M6 Pro: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 15,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 5జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

Nokia G42 5G: నోకియా జీ42 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 12,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

Lava Blaze 5G: లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ. 9,799కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.




