Realme C63: ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు నెవర్‌ బిఫోర్‌.. ఎయిర్‌ గెశ్చర్‌తో పాటు మరెన్నో..

మార్కెట్లో ప్రస్తుతం బడ్జెట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌ సీ63 పేరుతో ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jul 02, 2024 | 9:13 PM

రియల్‌మీ సీ63 పేరుతో భారత మార్కెట్లోకి సోమవారం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అధికారికంగా లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ జులై 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

1 / 5
ఫీచర్ల విషయానికొస్తే రియల్‌మీ సీ63 ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అంందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

2 / 5
రియల్‌మీ సీ63 ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను జేడ్ గ్రీన్‌, లెదర్‌ బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో ప్రత్యేకంగా ఎయిర్‌ గెశ్చర్‌ ఫీచర్‌ను అందించారు.

3 / 5
ఎయిర్‌ గెశ్చర్‌ ఫీచర్‌తో స్క్రీన్‌ను టచ్‌ చేయకుండానే ఆపరేట్ చేసుకోవచ్చు. కొలాప్సబుల్ మినీ క్యాప్సూల్ ఫీచర్‌తో నోటిఫికేషన్స్‌ను పొందొచ్చు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో అక్టాకోర్‌ యూనిసోక్‌ టీ613 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 90 నిమిషాల్లో బ్యాటరీ 100 శాతం ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ చెబతోంది.

5 / 5
Follow us