Narender Vaitla |
Jul 12, 2023 | 1:50 PM
యూకేకు చెందిన నథింగ్ ఫోన్‌కు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా నథింగ్ ఫోన్ 2 కూడా భారత మార్కెట్లోకి వచ్చేసింది.
నథింగ్ ఫోన్ 2 జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుండగా ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమ్యాయి. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నథింగ్ ఫోన్ 2లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,080x2,412 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
క్వాల్కమ్ 4ఎన్‌ఎమ్ స్నాప్‌డ్రాగన్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 44,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 49,999గా ఉండనుంది. అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999గా ఉండనుంది.