
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ పేరుతో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి.

ఆగస్టు 24 (మంగళవారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ ప్రి-బుకింగ్స్ మొదలయ్యాయి. మోటరోలా ఎడ్జ్ 20 (8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్) ఫోన్ ధర రూ. 29,999గా ఉండగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (6జీబీ ర్యామ్ + 128 జీబీ) ధర రూ. 21,499గా ఉంది.

మోటరోలా ఎడ్జ్ 20 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇందులో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లేను అందించారు.

ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 778జీపై నడిచే ఈ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రెయిర్ కెమెరాను 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌లో 30 వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.