Meizu 21: 200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌.. మార్కెట్లోకి కొత్త ఫోన్‌

|

Dec 02, 2023 | 9:04 PM

ప్రస్తుతం కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్మార్ట్ ఫోన్‌లోను మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు 20 ఎంపీ కెమెరా అంటేనే అబ్బో అనుకునే వాళ్లు ఇప్పుడు కెమెరా మెగాపిక్సెల్స్‌ ఏకంగా 100లు దాటేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన మెయిజు అనే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మెయిజు 21 పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. క్వాల్‌కాలం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. వీటిలో మెయిన్‌ కెమెరా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫీచర్లను అందించారు.

3 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 39,000కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ధర రూ. 43,000కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 45,000గా నిర్ణయించారు.

4 / 5
మెయిజు 21 స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే... వైఫై, నావిక్, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, ఏ-జీపీఎస్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

5 / 5
సూపర్ ఎంటచ్ డిస్‌ప్లే 0.075 సెకన్ల రెస్పాన్స్ రేట్‌ను అందించనుంది. సెల్ఫీల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్‌ ఈ ఫోన్‌ సొంతం.