Lenovo Tab M9: లెనోవో నుంచి అదిరిపోయే ట్యాబ్‌ వచ్చేసింది.. తక్కువ ధరలో మాంచి ఫీచర్లు.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో తాజాగా మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌9 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్‌ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్యాబ్లెట్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: May 26, 2023 | 6:00 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ తయారీ సంస్థ లెనోవో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌9 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ను LTE, Wi-fi ఓన్లీ అని రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు.

1 / 5
 లెనోవో ట్యాబ్‌ ఎమ్‌9 ట్యాబ్లెట్‌ ధర రూ. 12,999గా ఉంది. ఈ ట్యాబ్లెట్‌లో 9 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,340 x 800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌,  ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఈ ట్యాబ్‌ సొంతం.

2 / 5
 మీడియాటెక్‌ హీలియో జీ80 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌తో 64జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇంఉదలో 5100 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను ఇచ్చారు.

4 / 5
ఇక 344 గ్రాముల బరువుతో ఉండే ఈ ట్యాబ్లెట్‌ జూన్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు.

5 / 5
Follow us