
భారతదేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్ 3 పేరుతో ఈ ఫోన్ను తీసుకొచ్చారు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లావా బ్లేజ్ 3 స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్‌ప్లేతో కూడిన స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లను అందించారు.

కెమెరా పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 0 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించార. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను గ్లాస్ ఫినిసింగ్‌తో తీసుకురావడం విశేషం. రూ. 10 వేల బడ్జెట్‌లో ఈ ఫీచర్ అందించడం విశేషం. డ్యూయల్ స్టీరియో స్పీకర్ అందించిన ఈ ఫోన్‌ను గ్లాస్ గోల్డ్, గ్లాస్ బ్లూ రంగుల్లో తీసుకొచ్చారు. ధర విషయానికకొస్తే ర. 9,999గా నిర్ణయించారు. లావా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.