- Telugu News Photo Gallery Technology photos Huge sales on iphone 13, 14, 15, Check here for features and price details
iPhone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. వీటిపై భారీ డిస్కౌంట్
ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు టెక్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే ఐఫోన్ కొనాలని అందరికీ ఉన్నా ధర విషయంలో వెనుకడగువేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 20, 2024 | 11:06 AM

ఐఫోన్‌లపై భారీ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్15, ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి ఎలాంటి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 13 ఫోన్ అమెజాన్‌లో రూ. 52,999కి లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 59,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పైస రూ. 6,901 డిస్కౌంట్ లభిస్తోంది.

ఇక ఐఫోన్ 14 ప్లస్‌పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ. 61,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900కాగా ఆఫర్‌లో భాగంగా ఏకంగా రూ. 17,901 డిస్కౌంట్ లభిస్తోంది.

ఐఫోన్ 15 ఫోన్ ఆఫర్‌లో భాగంగా రూ. 67,999కి లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11 వేలకి పైగా తగ్గింపు ధరకు లభిస్తోంది.

ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక భారీ స్క్రీన్ కావాలనుకునే వారికి ఐఫోన్ 14 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బడ్జెట్‌లో ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.





























