- Telugu News Photo Gallery Technology photos These are the best smartphone under Rs 20,000, check list in telugu
Best Phone Under 20K: తక్కువ ధరలో 5జీ ఫోన్ కావాలా? ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి వందల కొద్దీ ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి వారంలో ఏదో ఒక కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతూనే ఉంది. దీంతో ఏ ఫోన్ కొనాలి? ఎంత ధర వెచ్చించాలి? అన్ని విషయంలో చాలా మంది గందరగోళ పడుతున్నారు. అయితే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో లభించే స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. అందుకే మీకు రూ. 20,000లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు మీకు అందిస్తున్నాం. వాటిల్లో రియల్‌మీ, రెడ్‌మీ, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి.
Updated on: Jun 20, 2024 | 12:32 PM

రియల్‌మీ పీ1 5జీ.. ఇది రెండు రంగులలో లభిస్తుంది: పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్. 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరి కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 15,999, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 ధరతో ప్రారంభమవుతుంది.

వివో టీ3.. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 360హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డీఆర్ 10+ సర్టిఫికేషన్‌తో పాటు గరిష్టంగా 1800 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సపోర్టు ఉంటుంది. ఒక టీబీ వరకూ ఎస్‌ఎస్‌డీ ద్వారా పెంచుకోవచ్చు.

రెడ్‌మీ నోట్13.. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ మద్దతుతో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సంరక్షణ ఉంటుంది. స్ల్పాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐసీ54 రేటింగ్ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది.సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీని, 33వాట్ల ఫాస్ట్ ఛారింగ్ సపోర్టుతో వస్తుంది..

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3.. 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంటుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోలో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 2160హెర్జ్ PWM డిమ్మింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 782జీ చిప్‌సెట్ ఆధారితమైనది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ట్రిపుల్ రియర్ కెమెరా అమరికను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

ఐకూ జెడ్9 5జీ.. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.




