
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే కొన్ని అంశాల ఆధారంగా ఇలాంటి ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు.

డీప్ ఫేక్ వీడియోల్లో ఉండే మనుషుల కదలికలు అసహజంగా ఉంటాయి. సహజంగా కనురెప్పులు ఆడకపోవడం, ముఖ కవళికల్లో మార్పులు లేకపోవడం. సందర్భానికి అనుగుణంగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ లేకపోయినా అది ఫేక్ వీడియోగా భావించాలి.

ఇక వీడియోలో కనిపించే ముహాలు ఎబ్బెట్టుగా కనిపించినా సదరు వీడియో ఫేక్ వీడియో కావొచ్చు. ముక్కు, నోరు, కళ్లు అసహజంగా కనిపించినా.. అలాగే శరీర కదలికలు, ముహం కదలికలు తేడాగా కనిపించినా అది కచ్చితంగా ఫేక్ వీడియోనే.

ఫేక్ వీడియోలను గుర్తించేందుకు ఉన్న మరో ప్రధాన లక్షాణం.. వీడియోలో వచ్చే ఆడియోకు ముఖ కదలికలు ఎలాంటి పొంతన లేకపోవడం. ఆడియోకు లిప్ సింక్ అవ్వదు.

డీఫ్ ఫేక్ వీడియోలు నాణ్యత ఎక్కువగా ఉండవు. వీడియో పిక్సెల్స్ విడిపోయినట్లు మసక, మసకగా కనిపిస్తుంటుంది. అలాగే వీడియోను ఎవరు పోస్ట్ చేశారన్న విషయాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. వీడియో పోస్ట్ చేసిన వారి విశ్వసినీయతను బట్టి వీడియో రియల్, ఫేక్ తెలుసుకోవచ్చు.