Smart TV: వర్షాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.? మీ స్మార్ట్‌ టీవీ డేంజర్‌లో పడ్డట్లే..

|

Jul 22, 2024 | 2:41 PM

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో స్మార్ట్‌ టీవీ సర్వసాధారణంగా మారిపోయింది. మారుతోన్న కాలంతో పాటు టీవీ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఉన్న పోర్టబుల్ టీవీల స్థానంలో గోడకు వేలాడే టీవీలు వచ్చేశాయ్‌. అయితే ధర ఎక్కువగా ఉండే ఈ టీవీల విషయంలో జాగ్రత్తలు కూడ అలాగే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో స్మార్ట్‌ టీవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
వర్షాకాలంలో టీవీ వైరింగ్‌ను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. వైర్‌కు ఎక్కడైనా స్లీవ్‌ పోయిందా.? టేప్‌తో అతుకులు వేసిన చోట ఏవైనా డ్యామేజ్‌ ఉందా చూసుకోవాలి. వైర్లు నీటిలో తడిస్తే టీవీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైరింగ్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి.

2 / 5
ఇక వర్షాలు ఎక్కువగా పడుతున్న సమయంలో గోడలకు తేమ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్మార్ట్‌ టీవీలను గోడకు వేలాడదీస్తాం కాబట్టి. ఆ తేమ టీవీలోకి వెళ్లే ప్రమాదం దీనివల్ల టీవీ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. గోడకు తేమ వస్తే వెంటనే టీవీని అక్కడి నుంచి తొలగించాలి.

3 / 5
ఇక కిటికీలు ఉన్న చోట్ల టీవీని ఏర్పాటు చేసుకుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటున కిటికీలో నుంచి నీరు టీవీపై పడితే వెంటనే అలర్ట్ అవ్వాలి. టీవీని ఆఫ్‌ చేసేసి, ప్లగ్‌ను కూడా తీసేయాలి.

4 / 5
సాధారణంగా వర్షాకాలంలో ఉరుములు రావడం సర్వసాధరణమైన విషయం. దీంతో విద్యుత్‌ ప్రవాహంలో కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల టీవీలో ఐసీలు, సర్క్యూట్స్‌ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉరుములు పడుతున్న సమయంలో ప్లగ్‌ తీసేయ్యాలి.

5 / 5
ఇక తడి చేతులతో టీవీలను ఆన్‌ చేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే మీ సెటప్‌ బాక్స్‌ సరైన ప్రదేశంలో ఉందా.? ఏదైనా నీటి పదన ఉందా లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.