Smart watch: స్మార్ట్‌ వాచ్‌లో స్లీప్‌ ట్రాకింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా.?

|

Dec 01, 2023 | 11:32 PM

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఒక గ్యాడ్జెట్. కానీ నేడు స్మార్ట్ వాచ్‌ల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఫోన్‌ చేసే అన్ని పనులు వాచ్‌లు చేసే రోజులు వచ్చేశాయ్‌. అధునాతన టెక్నాలజీతో వస్తున్న స్మార్ట్‌ వాచ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే స్మార్ట్ వాచ్‌లో ఉండే స్లీప్‌ ట్రాకింగ్ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో, ఎప్పుడైనా ఆలోచించారా.?

1 / 5
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతికి స్మార్ట్ వాచ్‌ కనిపిస్తోంది. వాచ్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో వీటిని వినియోగం పెరిగింది. ఇక ఇందులోని ఫీచర్లు సైతం యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి.

2 / 5
స్మార్ట్ ఫోన్స్‌లో ఎన్నో రకాల హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్స్‌ ఉన్నాయి. వీటిలో స్లీప్‌ ట్రాకింగ్ ఫీచర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరు ఎంత సమయం నిద్ర పోయారు.? నాణ్యమైన నిద్ర పొందారా.? లేదా.? అన్న విషయాలను స్మార్ట్ వాచ్‌లోని ఈ ఫీచర్‌ చెప్పేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
సాధారణంగా స్మార్ట్ వాచ్‌లో ఫిట్‌నెస్‌ను లెక్కించడానికి యాక్టిగ్రఫీ అనే సెన్సార్‌ ఉపయోగపడుఉంది. అలాగే.. గైరోస్కోప్‌, యాక్సిలరోమీటర్‌ సెన్సార్లతో మణికట్టు కదలికలను పరీక్షించడం ద్వారా నిద్రను ట్రాక్‌ చేస్తాయి.

4 / 5
దీని ఆధారంగా ఒక వ్యక్తి ఎంతసేపు నిద్రపోయాడు.? తెల్లార్లు నిద్రలో ఏమైనా డిస్బ్రబెన్స్‌లు ఉన్నాయా.? మధ్యలో మేల్కువ వచ్చిందా లాంటి వివరాలను నిద్ర నాణ్యత ఆధారంగా లెక్కిస్తారు.

5 / 5
మరి రాత్రుళ్లు స్మార్ట్ వాచ్‌ ధరించి పడుకోవడం భద్రమేనా అంటే.. స్మార్ట్‌వాచ్‌లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అయితే.. ఇది తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి వీటివల్ల ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.