
డిజో వాచ్ డీ: రూ. 5 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌ల్లో ఇది ఒకటి. 1.8 ఇంచెస్ డిస్‌ప్లే, 150కిపైగా డైల్స్ ఈ స్మార్ట్ వాచ్ సొంతం. ఐదు రకాల కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్ ధర రూ. 2,999గా ఉంది.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో4: ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,499గా ఉంది. ఇందులోని బ్రైట్ డిస్‌ప్లేతో ఎండలో నిల్చున్నా వాచ్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు 150కిపైగా క్లౌడ్ ఆధారిత, యానిమేటెడ్ వాచ్ ఫేస్‌లు అందించారు.

బోట్ ప్రీమియా: ఈ రాఖీకి మీ సిస్టర్స్‌కు బహుమతిగా ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 4,499గా ఉంది. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ వాచ్ ప్రత్యేకగా చెప్పొచ్చు. బుల్ట్ ఇన్ స్పీకర్, మైక్రోఫోన్, మెటాలిక్ డిజైన్‌తో రూపించారు. అలాగే ఈ వాచ్‌ను ఐపీ67 డస్ట్, చమట, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో అందించారు.

రియల్‌మీ వాచ్ 2 లైట్: రూ. 4,999రి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌లో 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్స్ అందించారు. ఎస్‌పీఓ2 సెన్సర్‌తో మరెన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.

డిజో వాచ్ ఆర్: రూ. 5000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచెస్‌లో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,999గా ఉంది. ఇందులో 1.3 ఇంచెస్ అల్ట్రా షార్ప్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 110కిపైనా వాచ్ ఫేసెస్‌ను అందించారు.