- Telugu News Photo Gallery Technology photos Best 5g smartphones under 15k, check here for full details Telugu Tech News
5G Phones: 5జీ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15 వేలలో బెస్ట్ డీల్స్ ఇవే..
దేశంలో దాదాపు అన్ని టెలికం కంపెనీలు 5జీ సేవలను అందబాటులోకి తీసుకొచ్చాయి. తక్కువ ఖర్చుతోనే 5జీ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కొత్త పోటాపోటీగా 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 5జీ ఫోన్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే రూ. 15వేలలో 5జీ స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి. ఇంతకీ ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Oct 15, 2023 | 5:54 PM

ఇంటెల్ పీ55 5జీ.. ఇంటెల్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999కాగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 9,699గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

రియల్‌మీ నార్జో 60x 5జీ.. రియల్ మీ కంపెనీ నుంచి లాంచ్ చేసిన నార్జో 60 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

పోకో ఎమ్6 ప్రో 5జీ.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ పోకో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10,999గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్2 ప్రాసెసర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్14 5జీ.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్ 14 5జీ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,990గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

వివో టీ2ఎక్స్.. వివో టీ2 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.





























