Narender Vaitla |
Mar 11, 2021 | 4:33 PM
డబ్బులు చెల్లించే పద్ధతులు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు కేవలం నగదు బదిలీ మాత్రమే ఉండేది.
ప్రస్తుతం వీటి స్థానంలో పూర్తిగా డిజిటల్ చెల్లింపులు వచ్చి చేరాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ ప్రైవేటు బ్యాంకు తాజాగా పేమెంట్స్ కోసం సరికొత్త డివైజ్‌లను తీసుకొచ్చింది.
వీటితో ఎలాంటి కార్డులు, వ్యాలెట్లు లేకున్నా చేతుకు ధరించిన డివైజ్‌తో పేమెంట్ చేసేయొచ్చు.
రూ.5 వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే.. పిన్ అవసరం ఉంటుంది. ఈ డివైజ్‌ను 'వియర్ అండ్ పే'గా పిలుస్తున్నారు.
ఈ డివైజ్ కోసం తొలుత రూ.750 వార్షిక ఫీజు చెల్లించాలి అనంతరం ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.