Battery Problems: మొబైల్‌ బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో చార్జింగ్‌ సమస్యకు చెక్‌..!

| Edited By: Ravi Kiran

Nov 28, 2023 | 10:00 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉండడం తప్పనిసరైంది. గతంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునే వాళ్లు. ఇప్పుడు పిల్లలు మొబైల్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డారంటే ఈ ఫోన్స్‌ మన జీవితంలో ఎంత భాగమైపోయాయో? అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లందరినీ వేధించే ఒకే ఒక సమస్య బ్యాటరీ. బ్యాటరీ సమస్యలు ఫోన్‌ వాడకాన్ని దెబ్బతీస్తాయి. మరికొంత మంది ఫోన్‌ చార్జింగ్‌ ఎంత పర్సెంటేజ్‌ ఉందో? చూసుకుని ఎ‍ప్పటికప్పుడు చార్జింగ్‌ పెడుతూ ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్స్‌ బ్యాటరీ సమస్యలకు చెక్‌ పెట్టడానికి టెక్‌ నిపుణులు సూచనలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

1 / 5
మొబైల్‌ వాడే సమయంలో వైఫై, బ్లూ టూత్‌ వాడకంపై ఓ కన్నేసి ఉంచాలి. వైఫై, బ్లూటూత్‌ మాత్రం అవసరమైన సమయంలోనే ఆన్‌ చేయడం వల్ల చార్జింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

2 / 5
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. తాజా ఓఎస్‌కు అప్‌డేట్‌ చేసినప్పుడు బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే లోకేషన్‌ ట్రాకింగ్‌ను ఆఫ్‌ చేయడం కూడా మంచిదని నిపుణుల వాదన. లోకేషన్‌ ట్రాకింగ్‌ అనేది బ్యాటరీను మరింత మెరుగుపరుస్తుంది.

3 / 5
ముఖ్యంగా ఫోన్‌ బ్రైట్‌నెస్‌ కచ్చితంగా ఆటో మోడ్‌కు మార్చాలి. దీని వల్ల బ్యాటరీ చాలా బాగా పని చేస్తుంది. ముఖ్యంగా ఆటోమోడ్‌ అనేది మనం ఎక్కడ ఉన్నామో? దానికి అనుగుణంగా  పని చేస్తుంది.

4 / 5
డార్క్‌ మోడ్‌ వాడడం వల్ల కూడా బ్యాటరీను సేవ్‌ చేయవచ్చు. డార్క్‌మోడ్‌ వల్ల బ్యాటరీ లైఫ్‌ మెరుగుఅవుతుంది. అలాగే పుష్‌ నోటిఫికేషన్లను కూడా ఆఫ్‌ చేసుకోవడం ఉత్తమం.

5 / 5
స్మార్ట్‌ఫోన్‌ చార్జ్‌ చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫోన్‌ హీట్‌ కాకుండా చూసుకోవాలి. రాత్రి పూట మద్దతు కోసం ఆప్టిమైజ్‌ చార్జింగ్‌ను ఉపయోగించాలి.