
iQOO Z6 Lite 5G: కాస్త ధర ఎక్కువైనా పర్లేదు అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ. 10 వేలలో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఐక్యూ బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ. 19,999గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,999కే సొంతం చేసుకోవచ్చు. ఇతర ఆఫర్లు కలుపుకుంటే మరో రూ. వెయ్యి తగ్గుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు.

POCO C55: పోకో సీ55 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా ప్రస్తుతం సేల్ భాగంగా ఏకంగా 43 శాతం డిస్కౌంట్‌తో రూ. 7,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ లార్జ్ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు.

realme narzo N53: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,999కాగా ప్రస్తుతం సేల్‌లో 36 శాతం డిస్కౌంట్‌తో రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ సూపర్ వూక్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.

Redmi 13C: తక్కువ ధరలో లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 13సీ ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ. 11,999కాగా సేల్‌లో భాగంగా రూ. 7,699కి సొంతం చేసుకోవచ్చు. 4జీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్ ఏఐ రెయిర్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

TECNO POP 8: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 7,799కాగా సేల్‌లో భాగంగా రూ. 6,799కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్ విత్ డీటీఎస్ అందించారు. 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.56 ఇంచెస్‌తో కూడిన డాట్ ఇన్ డిస్‌ప్లేను అందించారు. అల్ట్రా ఫాస్ట్ సైడ్ ఎడ్జ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.