Diabetic Eye Disease: కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా.. ఈ వ్యాధి కావచ్చు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి..
డయాబెటిస్ సమస్య ఉన్నవారిలో కంటి చూపు మందగించే అవకాశాలు ఉంటాయి. కొన్నికొన్నిసార్లు వివిధ వస్తువుల రూపాలను కనిపెట్టడం కూడా చేయలేకపోతారు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని చక్కెర వ్యాధితో బాధపడుతున్న మహిళలు.. వారి కండ్లపై కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. డయాబెటిస్1, టైప్-2 కలిగిఉన్న దాదాపు 25 శాతం మందిలో రక్తంలో అధిక చక్కెరల స్థాయితో పాటు కంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించలేకపోవడంతో అది కంటి వెనుక ఉండే సన్నటి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




