
స్వీట్‌కార్న్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. స్వీట్ కార్న్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

జీర్ణ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్ కార్న్ తినటం వల్ల మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బీ- 3, బీ- 5, బీ-6, బీ- 9 మొదలైన విటమిన్లు ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఫైటో కెమకిల్స్ ఎక్కువగా ఉంటాయి. స్వీట్ కార్న్ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కార్న్ లో ఉండే విటమిన్ బి12 అనీమియా తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరమైనది. అంతేకాదు..

కార్న్‌లోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. స్వీట్‌కార్న్‌లో లుటీన్, జియాక్సంతిన్ వంటి మూలకాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ రెండు కెరోటినాయిడ్లు కళ్ళకు ముఖ్యమైనవి. రక్తంలో చక్కర స్థాయి అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్ మంచిది.

స్వీట్‌కార్న్ తినటం వల్ల ఇది డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. స్వీట్‌కార్న్‌లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ ఫెరూలిక్ యాసిడ్, బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ట్యూమర్స్ ను తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.