Ghee On Empty Stomach: ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే జరిగేది ఇదే..!

|

Dec 30, 2024 | 7:07 PM

నెయ్యి తింటే లావెక్కుతారు.. ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది అనేది కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీకడుపుతో నెయ్యి తీసుకోవటం వల్ల ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అదేలాగో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

1 / 6
నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి ఉండడానికి హెల్ప్ చేయడంతో పాటు..మరెన్నో అనారోగ్య  సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. నెయ్యి తింటే బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీన్​ను ఫాలో త్వరలోనే ఊహించని మార్పులు గమనిస్తారు.

2 / 6
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవటం వల్ల శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు.. కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. టాక్సిన్ల రూపంలో బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు దరిచేరకుండా రక్షిస్తుంది.

3 / 6
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొవ్వు పేరుకు పోకుండా హెల్ప్ చేస్తుంది. పొట్టను కూడా తగ్గిస్తుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజం ఎంత పెరిగే.. మీరు అంత యాక్టివ్​గా ఉంటారు. అంతే వేగంగా బరువును తగ్గించుకుంటారు.

4 / 6
ఉదయాన్నే నెయ్యి తీసుకోవటం వల్ల గట్​ హెల్త్​ని మెరుగుపరిచి.. తీసుకున్న ఆహారాన్ని, దానిలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

5 / 6
చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, సహజమైన మెరుపును అందించాలన్నా.. మీరు రోజూ నెయ్యిని మీ రొటీన్​లో చేర్చుకోవచ్చు. ఇది స్కిన్​కి మంచి గ్లోని అందించి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు, స్కిన్​ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6 / 6
మతిమరుపు, వయసు ద్వారా పెరిగే మెదడు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తితో పాటు.. పనిపై ఫోకస్ చేసే విధంగా నెయ్యిలోని హెల్తీ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. పిల్లలు కూడా దీనిని రెగ్యులర్​గా తినొచ్చు. ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో కాకుండా స్పూన్ తింటే మంచిదని సూచిస్తున్నారు.