Daily Intake of Sugar: పూర్తిగా చక్కెర మానేసినా ప్రమాదమే! అసలు రోజుకు ఎంత తినాలో తెలుసా?

Edited By: Ravi Kiran

Updated on: Jul 26, 2024 | 9:00 AM

సన్నగా, నాజూగ్గా.. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ నేరుగా తీసుకోవడం మానేస్తుంటారు. అలాగే స్వీట్లు కూడా తీసుకోరు. ఆహారం నుండి టీ తయారు చేయడం వరకు ఎక్కడా చక్కెరను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకుంటారు. శరీరంలో కొవ్వు తగ్గడానికి చక్కెర ఉపయోగించడం మానేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ప్రమాదం కూడా దరిచేరదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

1 / 5
సన్నగా, నాజూగ్గా.. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ నేరుగా తీసుకోవడం మానేస్తుంటారు. అలాగే స్వీట్లు కూడా తీసుకోరు. ఆహారం నుండి టీ తయారు చేయడం వరకు ఎక్కడా చక్కెరను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకుంటారు. శరీరంలో కొవ్వు తగ్గడానికి చక్కెర ఉపయోగించడం మానేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ప్రమాదం కూడా దరిచేరదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఇతర వ్యాధులు వస్తాయంటున్నారు.

2 / 5
అలాగే అధిక చక్కెర కలిగి ఉండే శీతల పానీయాలను పూర్తిగా నివారించాలి. కృత్రిమ చక్కెర మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పూర్తిగా చక్కెర తీసుకోవడం మానేయకుండా నిర్దిష్ట కొలతల ప్రకారం దీనిని తీసుకోవచ్చు.

3 / 5
పంచదార తినడం మానేస్తే నిద్ర కూడా బాగా పడుతుంది. నిద్రలేమి ఉంటే షుగర్‌కు దూరంగా ఉండటం మంచిది. పనిని వేగంగా చేయాలనుకున్నా, చక్కెర తీసుకోవడం తగ్గించడం మంచిది. రోజులో చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే చక్కెర తీసుకోవడం తగ్గిస్తే పనితీరును మెరుగుపరచుకోవచ్చు.

4 / 5
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి తన రోజువారీ కేలరీలలో 10 శాతం చక్కెర తీసుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం, వయసును బట్టి రోజుకు 3-5 చెంచాల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

5 / 5
రోజంతా ఎంత చక్కెర తీసుకోవాలనేది మీ జీవనశైలి, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజువారీ జీవన కార్యకలాపాలను నిర్వహించడానికి, శారీరకంగా చురుకుగా ఉండటానికి కేలరీలు అవసరం.