కోకో బటర్: కోకో బటర్ ప్రధానంగా చాలా క్రీములలో ఉపయోగించబడుతుంది. ఇది స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే సమయంలో కోకో బటర్‌ను స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేయాలి. బాగా మసాజ్ చేసి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె : స్ట్రెచ్ మార్క్‌లను పోగొట్టడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది. పగలు లేదా రాత్రి పడుకునే ముందు అయినా కొబ్బరి నూనెను అప్లై చేయొచ్చు. కొబ్బరి నూనెతో రోజూ మసాజ్ చేస్తే అధ్బుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది మీ చర్మానికి పోషణ, తేమను అందించడంలో సహాయపడుతుంది.
అలోవెరా : కలబంద మీ చర్మ సంరక్షణకు గొప్ప పదార్థంగా పని చేస్తుంది. ఇది అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అలోవెరా ఆకు నుండి తాజా జెల్ తీసుకొని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. దీన్ని రోజూ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్బుతంగా పని చేస్తుంది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తరువాత క్లీన్ చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా అద్భుతం ఫలితం కనిపిస్తుంది.
దోసకాయ, నిమ్మరసం : నిమ్మరసం మచ్చలను నయంలో అద్భుతంగా పని చేస్తుంది. దోసకాయ మీ చర్మాన్ని చల్లబరుస్తుంది. నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమాన భాగాలుగా కలపి స్ట్రెచ్ మార్క్‌పై అప్లై చేయాలి. చర్మంపై కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మీరు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.