Stress Control: డైరీ రాసే అలవాటు మనసును తేలిక పరుస్తుంది.. నమ్మకం కుదరట్లేదా! మీరూ ట్రై చేయండి

Updated on: Feb 21, 2024 | 12:46 PM

ఒత్తిడికి లోనైనప్పుడు, కార్టిసాల్ హార్మోన్ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో విడుదలవుతుంది. ఈ కార్టిసాల్ ఎక్కువ కాలం పాటు అధికంగా విడుదలవుతూ ఉంటే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఒత్తిడిని నియంత్రించడంలో ఈ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో దృష్టి సమస్యలు వస్తాయి. అలాగే ఒత్తిడి పెరిగినప్పుడు, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది...

1 / 5
ఒత్తిడికి లోనైనప్పుడు, కార్టిసాల్ హార్మోన్ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో విడుదలవుతుంది. ఈ కార్టిసాల్ ఎక్కువ కాలం పాటు అధికంగా విడుదలవుతూ ఉంటే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఒత్తిడిని నియంత్రించడంలో ఈ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో దృష్టి సమస్యలు వస్తాయి. అలాగే ఒత్తిడి పెరిగినప్పుడు, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

2 / 5
కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. 30 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడి పెరిగితే గ్లాకోమా, క్యాటరాక్ట్ సమస్యలు వస్తాయి. అస్పష్టమైన దృష్టితోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ హార్మోన్‌ సక్రమంగా పనిచేయాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

3 / 5
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. క్రమం తప్పకుండా తాజా పండ్లు, కూరగాయలు తినాడి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. సమతుల్య ఆహారం శరీరంలోని అనేక సమస్యలను నివారిస్తుంది. ఒమేగా 3 కళ్ళకు కూడా ముఖ్యమైనది. దూమపానం వదిలేయాలి. స్మోకింగ్ పూర్తిగా మానేస్తే ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాలు మెరుగవుతాయి. దీర్ఘకాలిక ధూమపానం నరాల సంబంధిత సమస్యలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి పొగతాగడం పూర్తిగా మానేయాలి. మూడు గంటలు నిరంతరం పని చేస్తే కనీసం 20 నిమిషాల విరామం తీసుకోవాలి.

4 / 5
రోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. గట్టిగా ఊపిరి తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా చేసేటప్పుడు మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోవాలి. నోటి ద్వారా బయటకు వదలాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. రోజూ యోగా చేయడం ప్రారంభించండి. కనీసం 15-20 నిమిషాల పాటు యోగా చేసినా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అందులో శరీరం, మనసు రెండూ బాగుంటాయి. అల్పాహారం సరిగ్గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది

5 / 5
రోజూ డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. మనసులో మాటలను పేపర్‌పై పెట్టాలి. మీ మనసులో ఏముందో వ్రాయడానికి సంకోచించకండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు తేలికగా అనిపిస్తుంది. ఏదో ఒక అలవాటును హాబీగా మార్చుకోండి. ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం, నడకకు వెళ్లాలి. రోజూ వీటిని చేస్తే ఇతర ఏ సమస్య శరీరంలో తిష్టవేయదు.