Heart Health: ఈ ఆయుర్వేద మూలికలతో మీ గుండె పదిలం.. వెంటనే మీ డైట్ లో చేర్చుకోండి..

Updated on: Jul 15, 2023 | 3:54 PM

శరీరంలో ముఖ్యమైన భాగల్లో గుండె ఒకటి. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందించే రక్తాన్ని సరఫరా చేయడం దీని పని. ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పనితీరు సమర్థవంతంగా ఉండటం చాల అవసరం. ఆహారం, మూలికా మందులు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి మంచి ఆహార పదార్థాలతో పాటు కొన్ని మూలికలు కీలక పాత్ర వహిస్తాయి. ఆ మూలికా పదర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
అర్జున చెట్టు: గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలమైన వాటిలో అర్జున చట్టు ఒకటి. అర్జున బెరడు పొడి హార్ట్ టానిక్‌గా పనిచేస్తుంది. గుండె కండరాలను బలపరిచి రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 6
అమలకి: అమలకిని వాడుకలో ఆమ్లా అంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్, అనాల్జేసిక్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం కాలేయం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ అల్సర్, మధుమేహం వంటి సమస్యలతో బాధపడే వారికి ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమ్లా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమ్లా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3 / 6
మొరింగ: గుండెను ఆరోగ్యం కోసం ఉపయోగపడే మరో మూలిక మొరింగ. దీనిలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. మొరింగాను వాడుక భాషలో మునగ చెట్టు అంటారు. ఈ చెట్టు ఆకులు, కాయలు, పువ్వులు శతాబ్దాలుగా భారతీయ వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెకు మేలు చేస్తుంది.

4 / 6
అవిసె గింజలు: గుండె జబ్బుల నివారణకు ఉపయోగకరంగా వాటిల్లో అవిసె గింజలు ఒకటి. ఇవీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది చాలా సందర్భాలలో గుండె జబ్బుల నివారణకు కారణమవుతుంది.

5 / 6
పసుపు: పసుపులో కర్కుమిన్ సమ్మేళనం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మంచి ఉపయోగకారి. పసుపులో కర్కుమిన్ కండరాల పనితీరును మెరుగుపరచడమే కాక గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతాయి.

6 / 6
వీటి తరహాలోనే బ్రాహ్మీ, తులసి, అశ్వగంధ వంటి ఇతర మూలికలు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.