ఫ్రిజ్‌లో టమాటాలు పెడితే ఏమవుతుంది..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే..

Updated on: Jan 08, 2026 | 8:13 PM

Tomatoes: వంటింట్లో టమాటా లేనిదే ఏ వంటా పూర్తి కాదు. చట్నీ నుండి సాంబారు వరకు ప్రతి దాంట్లోనూ టమాటా ఉండాల్సిందే. అయితే మార్కెట్ నుండి తెచ్చిన టమాటాలను మనం వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. కానీ టమోటాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి రుచి మారడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు టమాటాలను ఎలా నిల్వ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
చాలామంది కచ్చిగా ఉన్న టమాటాలను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది చాలా తప్పు. టమాటాలు సహజంగా పండడానికి మితమైన వేడి, గాలి అవసరం. పండని టమోటాలను ఫ్రిజ్‌లో పెడితే, అవి పండే ప్రక్రియ ఆగిపోతుంది. ఫలితంగా వాటి సహజమైన రుచి, వాసన తగ్గిపోయి చప్పగా తయారవుతాయి. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద, నేరుగా ఎండ తగలకుండా ఉంచితేనే చక్కగా పండుతాయి.

2 / 5
బాగా పండిన టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు కానీ అది ఐదు రోజులకు మించకూడదు. అతిగా చల్లని ఉష్ణోగ్రత టమోటాలోని కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల టమోటాల నాణ్యత తగ్గిపోతుంది. ఒకవేళ మీరు రెండు మూడు రోజుల్లోనే వాటిని వాడబోతున్నట్లయితే, ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట ఉంచడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల టమాటాలోని పోషకాలు మనకు పూర్తి స్థాయిలో అందుతాయి.

3 / 5
టమాటాలను వారం కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచితే, అవి బయటకు బాగానే కనిపిస్తాయి కానీ లోపలి నుండి కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అటువంటి టమాటాలను కూరల్లో వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
రిఫ్రిజిరేటర్‌లో ఉండే అధిక తేమ వల్ల టమాటాలపై మనకు తెలియకుండానే బూజు పేరుకుపోయే అవకాశం ఉంది. అటువంటి టమోటాలను తింటే.. వికారం, వాంతులు, విరేచనాలు,  బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.

5 / 5
టమాటాలను తాజాగా ఉంచుకోవాలనుకుంటే, వాటిని కొన్న వెంటనే ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటిని కూరగాయల కోసం కేటాయించిన డ్రాయర్‌లో ఉంచండి. టమాటా లోపల నల్లగా ఉన్నా లేదా వాసన వస్తున్నా వాటిని వాడకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.