Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు రోజూ గుప్పెడు తినండి చాలు.. ఈ రోగాలు రమ్మన్నా రావు..!

|

Dec 05, 2024 | 5:10 PM

ప్రతి వంటింట్లోనూ మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక వంటకాల్లో తప్పనిసరిగా మెంతుల్ని వాడుతుంటారు. ఇవి ఆ వంటకు చక్కటి రుచిని తెస్తాయి. అయితే.. వీటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రాగి, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, మాంగనీసుతోపాటు.. విటమిన్లు ఎ, బి6, సి, కె వంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. మెంతులను మొలకెత్తాక తీసుకుంటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉండేలా చేస్తాయి.. మధుమేహం బాధితులు రోజు మొలకెత్తిన మెంతులు తీసుకుంటే డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మెంతులు రక్తంప్రవాహంలోకి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడదల చేస్తుంది. దీంతో, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరగవు.

2 / 5
మెంతుల్ని మొలకలుగా చేసుకుని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే.. మొలకెత్తిన మెంతులలో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు సమృద్ధిగా ఉంటాయి. మెంతుల మొలకలను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయి.

3 / 5
మొలకెత్తిన మెంతుల్లోని పోషకాలు మీ కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన మెంతులలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇందులోని  గెలాక్టోమన్నన్‌.. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా రక్షిస్తాయి, ఫ్రీ రాడికల్స్‌తోనూ పోరాడతాయి.

4 / 5
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి మొలకెత్తిన మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. మొలకెత్తిన మెంతి గింజలలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్​లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
మొలకెత్తిన మెంతుల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను అదుపు చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.