AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS: ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించిన విరాట్‌ కోహ్లీ! రోహిత్‌, రాహుల్‌, వార్నర్‌ అందరూ వెనకే..

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 67వ సారి 50 ప్లస్ స్కోర్లు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధికం. మునుపటి రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉండగా, కోహ్లీ తన 59వ అర్ధశతకంతో ఈ రికార్డును అధిగమించాడు. కోహ్లీ 8 శతకాలతో పాటు 59 అర్ధశతకాలు సాధించాడు.

SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 7:24 PM

Share
ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆదివారం ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛేజ్‌ మాస్టర్‌గా తనకున్న బిరుదును నిలబెట్టుకుంటూ మరోసారి సూపర్‌ నాక్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గత మ్యాచ్‌లో ఇదే పంజాబ్‌ కింగ్స్‌పై సొంత గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోయిన ఆర్సీబీ.. రెండు రోజులు తిరక్కముందే.. పంజాబ్‌ హోం గ్రౌండ్‌లో వాళ్లను మట్టికరిపించింది.

1 / 6
అయితే.. ఈ మ్యాచ్‌లో 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి కోహ్లీ, తన ఐపీఎల్‌ కెరీర్‌లో 59వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 50 కంటే ఎక్కవ స్కోర్‌ను కోహ్లీ 67 సార్లు బాదేశాడు. ఇది ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యధికం.

2 / 6
కోహ్లీ కంటే ముందు డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ సోర్లు కలిగి ఉన్నాడు. వార్నర్‌ 62 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలతో 66 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ 59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలతో 67 సార్లు 50 కంటే ఎక్కవ రన్స్‌ చేశాడు.

3 / 6
ఇక మూడో స్థానంలో టీమిండియా బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు. ధావన్‌ 53 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్‌ కొట్టాడు. అందులో 51 హాఫ్‌ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి.

4 / 6
అలాగే నాలుగో ప్లేస్‌లో రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ తన జెర్సీ నంబర్‌ 45కు న్యాయం చేస్తూ.. 45 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అందులో 43 హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.

5 / 6
ఇక ఐదో ప్లేస్‌లో కేఎల్‌ రాహుల్‌ ఉన్నాడు. రాహుల్‌ 43 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్‌ చేశాడు. అందులో 39 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. విరాట్‌ కోహ్లీ మరో నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధిస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికైతే.. అత్యధిక సెంచరీలు, అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన రికార్డు తన పేరిటే ఉన్నాయి.

6 / 6